
Aug 13 2026 12:24 PM | Updated on Aug 13 2026 12:35 PM
స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంపై తొలిసారి బహిరంగంగా స్పందించారు. గత రెండేళ్లుగా తాను తీవ్ర మానసిక, భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన బ్రేకప్‌తో పాటు ఆ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు.
మార్పును ముందే గమనించారు.. ‘ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టు వెనుక ఎంతో బాధ ఉంది. గత రెండేళ్లుగా శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కుంగిపోయాను. ఆ సమయంలో నార్సిసిస్టిక్ అబ్యూజ్‌ను ( ఒక వ్యక్తి తన భాగస్వామిని మానసికంగా భావోద్వేగపరంగా వేధించడం) ఎదుర్కొన్నాను’ అని అనుపమ తెలిపారు. నాలో వచ్చిన మార్పుని కుటుంబ సభ్యులు, స్నేహితులు ముందుగానే గుర్తించారు. బ్రేకప్ విషయం బయటకు తెలిసి నెల రోజులే అయినప్పటికీ, తనకు దగ్గరగా ఉన్నవారికి ఈ విషయం ముందే అర్థమైంది’ అని అన్నారు.
‘సోషల్‌మీడియాలో పసుపు రంగు డ్రస్‌లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి ‘అనుపమ ఆత్మహత్య చేసుకుంది’ అని రాసి ఉంటే నాకు మరింత ప్రేమ దక్కేదేమో’ అని భావోద్వేగంగా మాట్లాడారు. ఈ రిలేషన్షిప్ సరైనది కాదని, తాను అందరికీ దూరమవుతున్నానని వారంతా గమనించారని చెప్పారు.
నిశ్చితార్థం కోసం.. రిలేషన్ ప్రారంభమైన కొద్ది రోజులకే తనను మాజీ ప్రియుడు తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడని తెలిపారు. మూడు నెలల్లోనే నిశ్చితార్థం గురించి చర్చలు కూడా జరిగాయని చెప్పారు. అయితే, తనకు మరికొంత సమయం కావాలని చెప్పినట్లు వెల్లడించారు.‘నేను నిశ్చితార్థానికి అంగీకరించి ఉంటే ఆ వివాహం చివరకు విడాకుల వరకు వెళ్లేదేమో. ఆ నిర్ణయం తీసుకున్నది కూడా నేనే’ అని స్పష్టం చేశారు.
నార్సిసిస్టిక్ అబ్యూజ్ గురించి మాట్లాడుతూ.. ‘చాలామంది నార్సిసిస్టిక్ వ్యక్తులు తమను తాము ఎక్కువగా ప్రేమిస్తారని అనుకుంటారు. కానీ వాస్తవానికి వారిపై వారికి నమ్మకం ఉండదు. వారి జీవితంలోకి ఎవరినీ రానివ్వాలనుకోరు. ఎప్పుడూ గుర్తింపు కోరుకుంటూ ఉంటారు’ అని వివరించారు. కెరీర్‌పై ప్రభావం.. తన వ్యక్తిగత జీవితం కెరీర్‌పై కూడా ప్రభావం చూపిందని అనుపమ ఆరోపించారు. ‘డ్రాగన్ సినిమా నా కెరీర్లో అతిపెద్ద విజయంగా నిలిచింది. అయినప్పటికీ ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొలేదు. చాలా సినిమాలను కూడా వదులుకున్నాను. నా జీవితంలోని ప్రతి విషయంలోనూ అతడు జోక్యం చేసుకునేవాడు’ అని చెప్పారు.
క్రూరంగా ప్రవర్తించేవాడు.. తన మాజీ ప్రియుడి ప్రవర్తనను విక్రమ్ నటించిన ‘అన్నియన్’ చిత్రంలోని పాత్రతో పోల్చిన అనుపమ.. ‘ఒక రోజు ఎంతో ప్రేమగా ఉండేవాడు. మరుసటి రోజు పూర్తిగా మారిపోయి క్రూరంగా ప్రవర్తించేవాడు. ఆ తర్వాత మళ్లీ క్షమాపణలు చెప్పి, ఇకపై అలా చేయనని హామీ ఇచ్చేవాడు. ఇదే పదేపదే జరిగేది’ అని వెల్లడించారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. అనుపమ చివరిగా ‘పెట్ డిటెక్టివ్’ చిత్రంలో కనిపించారు.
బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు)
హైదరాబాద్ : గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ రిహార్సల్స్ (ఫొటోలు)
ఫేమస్ బ్రిడ్జి దగ్గర హీరోయిన్ మమతా మోహన్ దాస్ (ఫొటోలు)
స్టాక్ లోకి లలితా జువెల్లరీ IPO.. ఒక్కో షేరు ఎంతో తెలుసా?
జగన్ సార్ ఉన్నంతవరకు మాకు ఎలాంటి భయం లేదు.. విరూపాక్షి భార్య కామెంట్స్
ఇప్పుడు జగనన్నను కలిసి ఒకే ఒక్క మాట చెప్పాలి
వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో డ్రోన్లు హల్ చల్





