© 2026 nimisham.in


King of Entertainment Sree Vishnu will next be seen in the film Comrade Kalyan. Mahima Nambiar plays the female lead. Directed by… The post Comrade Kalyan teaser: Entertaining tale of a Naxalite first appeared on Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT.
'Skanda' చిత్రానికి క్రిటిక్స్ నుండి సగటున 2.75/5 రేటింగ్ లభించింది. ముఖ్య సమీక్షలు: 123telugu - 2.75/5, GreatAndhra - 2.5/5, Telugu360 - 2.5/5.
'Skanda' చిత్రం 42వ రోజు బాక్సాఫీస్ వద్ద ₹0.2 కోట్ల గ్రాస్ మరియు ₹0.1 కోట్ల షేర్ వసూళ్లు నమోదు చేసింది. విడుదలైనప్పటి నుండి భారతదేశంలో మొత్తం నికర వసూళ్లు ₹40.0 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ వసూళ్లు ₹65.0 కోట్లకు చేరుకుని బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. ప్రతి రోజూ స్థిరమైన వసూళ్లతో ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెలుగు సినిమా అభిమానులు ఈ చిత్రాన్ని అద్భుతంగా స్వాగతిస్తున్నారు. ట్రేడ్ వర్గాలు ఈ చిత్రం రాబోయే వారాంతాల్లో మరిన్ని రికార్డులు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోజువారీ కలెక్షన్ పూర్తి వివరాల కోసం కింది పట్టికను చూడండి.

‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో అలరించబోతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆసక్తికరమైన పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు రొమాన్స్, ఎమోషన్స్ తో రూపొందిస్తున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మిస్తున్నారు. 1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో పాటు తొలి రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దసరా పండుగకు ముందు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ సినిమా నేపథ్యాన్ని మరింత ఆసక్తికరంగా చూపిస్తోంది. శ్రీవిష్ణు డార్క్ గ్రీన్ దుస్తుల్లో, మెడలో ఎర్రటి కండువాతో కామ్రేడ్ లుక్‌లో కనిపిస్తున్నారు. భుజానికి రైఫిల్, అడవిలో నడుస్తున్న ఆయనతో పాటు సత్య, ముక్కు అవినాష్ కూడా తోటి కామ్రేడ్లుగా కనిపిస్తున్నారు. ఆయుధాలతో ఉన్న ఈ పాత్రలు కథలోని సీరియస్ నేపథ్యాన్ని సూచిస్తుండగా, వారి ముఖాల్లో కనిపించే చిరునవ్వులు సినిమాలో వినోదం, యాక్షన్, ఎమోషన్ కూడా ఉంటాయని హింట్ ఇస్తున్నాయి. రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. దసరా సీజన్లో విడుదల తేదీ ఖరారు కావడంతో సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ మరింత వేగవంతం చేయనున్నారు