© 2026 nimisham.in

RBI to drain Rs 1 lakh crore as VRRR auctions fail to absorb liquidity
RBI announces 26-day VRRR auction to absorb Rs 5 lakh crore surplus liquidity

రూ.100 కోట్ల లాభాలు.. కలలోనైనా విన్నారా ఈ మాట...!
RBI's 30-day VRRR operation sees muted response amid high banking liquidity surplus

RRR వచ్చి నాలుగేళ్లు.. కానీ ఫ్రెండ్ షిప్ మేనియా మాత్రం తగ్గలేదే!

కీరవాణి వీడియోతో 'RRR 2' కన్ఫర్మ్? - అసలు విషయం ఇదే!

‘ఆర్ఆర్ఆర్ 2’ పై కీరవాణి స్పష్టత.. వైరల్ వీడియోలో నిజమెంత ?

వారణాసి తర్వాత జక్కన్న మాస్టర్ ప్లాన్.. RRR 2 పై కీరవాణి క్లారిటీ!

Keeravani | ‘RRR 2’పై మళ్లీ వైరల్ అవుతున్న వీడియో.. సీక్వెల్ నిజంగానే కన్ఫర్మ్ అయ్యిందా?

RRR 2 is suddenly back in the headlines, but is the sequel really confirmed? A video of the Oscar winner MM Keeravaani… The post Keeravaani Confirms RRR 2? Here’s the Truth Behind the Viral Video first appeared on Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT.
RBI mops up Rs 6.02 lakh crore through VRRR auctions against Rs 8.5 lakh crore intent

హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు నగరానికి కొంత దూరంలో ఉన్న ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధిలో రీజినల్ రింగ్ రోడ్ (RRR), ఫ్యూచర్ సిటీ, కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, మెట్రో విస్తరణ, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పెద్ద ప్రాజెక్టు పక్కనే భూమి కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం భారీ ధరలు చెల్లించాల్సి వస్తోంది. అయితే ప్రధాన రహదారులు లేదా అభివృద్ధి ప్రాజెక్టులకు ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికీ తక్కువ ధరలకు భూమి లభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో అభివృద్ధి విస్తరించినప్పుడు ఇలాంటి ప్రాంతాలకు కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. వికారాబాద్ జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో పాటు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. అనంతగిరి కొండలు, అడవులు, పర్యాటక ప్రాంతాలు ఇప్పటికే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు రోడ్డు కనెక్టివిటీ మరింత మెరుగుపడితే వికారాబాద్‌కు చేరుకోవడం సులభం కానుంది. ముఖ్యంగా బీజాపూర్ హైవే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండటం ఈ ప్రాంత భవిష్యత్తుకు కీలకంగా మారే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు ప్రయాణ సమయం తగ్గితే ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు, పెట్టుబడిదారుల రాకపోకలు పెరగవచ్చు. ఒక ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడితే అక్కడ నివాస, వాణిజ్య అవసరాలు కూడా క్రమంగా పెరుగుతాయి. హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతం సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే వికారాబాద్ పరిసరాల్లో భూమి ధరలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 120 గజాల ప్లాట్ ధర రూ. 10 లక్షలలోపే అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో భారీ తేడాలు ఉండవచ్చు. ప్రధాన రహదారికి

మాట్లాడితే ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అంటూ జబ్బలు చరుచుకుంటాం.. 1000 కోట్లు పరిచయం చేసింది మేమేనంటాం.. కానీ పర్ఫార్మెన్స్ అలా లేదు. కాస్త కఠువుగానే ఉంటుంది మరి.. ఓ పక్క సింగిల్ లాంగ్వేజ్ సినిమా 1000 కోట్లు కొడుతుంటే.. 2025 నుంచి మనోళ్లు సాధించేందేంటి..? బడ్జెట్స్‌పై పెడుతున్న ఫోకస్.. ఔట్ పుట్లో కనబడట్లేదెందుకు..? మన సినిమాలకు ఏమైంది..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..! 2022లో RRR 1200 కోట్లు.. 2024లో పుష్ప 2 సినిమా 1800 కోట్లు, కల్కి 2కు 1200 కోట్లకు పైగా వచ్చాయి. 2023లో సలార్ 500 కోట్ల క్లబ్బులో చేరింది.. 2024లో దేవర 500 కోట్ల వరకు వసూలు చేసింది. 2025లో మాత్రం కేవలం మాటలే కానీ చేతలేం లేవు. వచ్చిన స్టార్స్ తోక ముడిచారు. 1000 కోట్లని కలలు గన్న గేమ్ ఛేంజర్, వార్ 2, రాజా సాబ్ దారుణంగా నిరాశ పరిచాయి. 2026లోనూ పరిస్థితులు మారలేదు. 2026 వచ్చి 8 నెలలైపోయింది.. ఈ ఏడాది ప్యాన్ ఇండియా సినిమాలకు కలిసొచ్చిందేం లేదు. అల్లు అర్జున్, మహేష్ లాంటి హీరోలు 2025 నుంచి అసలు కనబడట్లేదు. అది కూడా టాలీవుడ్‌కు మైనస్సే. దాంతో 2026లోనూ 500 కోట్లు కూడా రాబట్టలేకపోయింది టాలీవుడ్. మన శంకరవరప్రసాద్ గారు, పెద్ది సినిమాలు మాత్రమే 300 కోట్ల క్లబ్బులో చేరాయి. పుష్ప 2 తర్వాత సౌత్‌లో అసలు 1000 కోట్లు కొట్టిన సినిమానే లేదు. మరోవైపు ధురంధర్ సింగిల్ లాంగ్వేజ్‌లోనే ఫస్ట్ పార్ట్‌తో 1400 కోట్లు, సెకండ్ పార్ట్‌తో 1800 కోట్లు వసూలు చేసింది. 2025-26లో 1000 కోట్లు దాటిన ఇండియన్ సినిమా ఇదొక్కటే. కన్నడలో కాంతార ఛాప్టర్ 1 మాత్రమే 850 కోట్లకు పైగా వసూలు చేసింది. దాని తర్వాత కూలీ తెచ్చిన 518 కోట్లే సౌత్‌లో హైయ్యస్ట్. ఈ లిస్టులో తెలుగు సినిమా ఒక్కటీ లేదు. మాట్లాడితే మనమే

సినిమా అంటే రెండున్నర గంటలే ఉండాలా..? కథ బాగుంటే మూడు కాదు మూడున్నర గంటలైనా చూస్తారు మన ఆడియన్స్ అంటున్నారు దర్శకులు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. మెల్లగా దీన్నే సక్సెస్ ఫార్ములాగా మార్చేస్తున్నారు మన హీరోలు. తాజాగా మరో హీరో మూడు గంటలకు పైగా బొమ్మ చూపించబోతున్నారు. పెరిగిన ఈ లెంత్పైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. మామూలుగా అయితే సినిమాలకి రెండున్నర గంటలు ఐడియల్ రన్ టైమ్ అంటారు. కానీ దాన్నిప్పుడు మార్చేస్తున్నారు మేకర్స్. 2.30 కాదు 3.30 గంటలు తీస్తామంటున్నారు. ఆ మధ్య పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ 3.44 హవర్స్ వచ్చింది.. దానికి ముందు డైరెక్ట్ రిలీజ్లోనూ 3.24 గంటలతో వచ్చారు సుకుమార్. యానిమల్ సైతం 3.21 గంటల నిడివితో వచ్చింది. మామూలుగా మూడు గంటల సినిమా అంటేనే మన దగ్గర బాగా అరుదు. అంత పెద్ద సినిమా చూడాలంటే అందులో విషయం చాలా ఉండాలి.. యాదృశ్చికమో ఏమో కానీ 3 గంటల నిడివి దాటిన సినిమాలు ఈ మధ్య కాసుల వర్షం కురిపించాయి. అది పుష్ప 2, యానిమల్ మాత్రమే కాదు.. ట్రిపుల్ ఆర్, కుబేరా కూడా. వీటి రన్ టైమ్ 3 గంటలకు పైగానే. గతేడాది లెంత్ మీద అన్ని అనుమానాలను పూర్తిగా తుడిచేసిన సినిమా రణ్వీర్ సింగ్ ధురంధర్. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఏకంగా 3.32 గంటల నిడివితో వచ్చి 1400 కోట్లు వసూలు చేసింది.. సెకండ్ పార్ట్ 3.49 గంటలతో వచ్చి ఏకంగా 1800 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాల విజయాలు చూసాక.. సినిమాకు లెంతీ రన్ టైమ్ అనేది అస్సలు మ్యాటరే కాదని ఫిక్సైపోయారు మేకర్స్. తాజాగా టాక్సిక్ రన్ టైమ్‌పై చర్చ మొదలైంది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 3.14 గంటలకుపై నిడివితో రాబోతుంది. పైగా A సర్టిఫికెట్ చిత్రమిది

హీరో తేజ సజ్జా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘మిరాయ్’ జపాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం శుక్రవారం జపాన్‌లో అత్యంత వైభవంగా విడుదల కానుంది. రిలీజ్‌కు ముందే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. గతంలో ఇండియన్ సినిమాలకు సంబంధించి జపాన్ మార్కెట్లో ట్రెండ్ సెట్ చేసిన బాహుబలి 2, టైగర్ జిందా హై వంటి భారీ చిత్రాల రికార్డులను ‘మిరాయ్’ దాటేసింది. భారతీయ చిత్ర పరిశ్రమ దృష్టిని ఈ బుకింగ్స్ ఒక్కసారిగా ఆకర్షించాయి. దీంతో జపాన్‌లో అత్యధిక డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన భారతీయ సినిమాల టాప్ 10 జాబితాలో ‘మిరాయ్’ 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా, యంగ్ హీరో తేజ సజ్జా మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోందని ఈ అడ్వాన్స్ బుకింగ్స్ నిరూపిస్తున్నాయి. ఫలితంగా జపాన్‌లో ఇప్పటికే విజయం సాధించిన ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ వంటి విజువల్ వండర్స్ సరసన ఈ సినిమా చేరింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ ప్రేక్షకులతో పాటు స్థానిక మూవీ లవర్స్ కూడా ఈ సినిమాపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో జపాన్ మార్కెట్లో ‘మిరాయ్’ మరిన్ని కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో తెలుగు చిత్రాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 143 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ‘మిరాయ్’, 2025లో అత్యధిక రెవెన్యూ సాధించిన టాప్ టాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. జపాన్ విడుదలతో ఈ కలెక్షన్ల రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది