© 2026 nimisham.in

పవర్ఫుల్ విలన్‌గా దూసుకొస్తున్న కుర్ర హీరో! బాలయ్య ‘దాదా’తో సీన్ మారనుందా?

హీరో తేజ సజ్జా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘మిరాయ్’ జపాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం శుక్రవారం జపాన్‌లో అత్యంత వైభవంగా విడుదల కానుంది. రిలీజ్‌కు ముందే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. గతంలో ఇండియన్ సినిమాలకు సంబంధించి జపాన్ మార్కెట్లో ట్రెండ్ సెట్ చేసిన బాహుబలి 2, టైగర్ జిందా హై వంటి భారీ చిత్రాల రికార్డులను ‘మిరాయ్’ దాటేసింది. భారతీయ చిత్ర పరిశ్రమ దృష్టిని ఈ బుకింగ్స్ ఒక్కసారిగా ఆకర్షించాయి. దీంతో జపాన్‌లో అత్యధిక డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన భారతీయ సినిమాల టాప్ 10 జాబితాలో ‘మిరాయ్’ 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా, యంగ్ హీరో తేజ సజ్జా మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోందని ఈ అడ్వాన్స్ బుకింగ్స్ నిరూపిస్తున్నాయి. ఫలితంగా జపాన్‌లో ఇప్పటికే విజయం సాధించిన ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ వంటి విజువల్ వండర్స్ సరసన ఈ సినిమా చేరింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ ప్రేక్షకులతో పాటు స్థానిక మూవీ లవర్స్ కూడా ఈ సినిమాపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో జపాన్ మార్కెట్లో ‘మిరాయ్’ మరిన్ని కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో తెలుగు చిత్రాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 143 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ‘మిరాయ్’, 2025లో అత్యధిక రెవెన్యూ సాధించిన టాప్ టాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. జపాన్ విడుదలతో ఈ కలెక్షన్ల రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది

తేజ సజ్జ హీరోగా నటించిన ఫాంటసీ అడ్వెంచర్ సినిమా ‘మిరాయ్’ (Mirai) విడుదల కాకముందే జపాన్‌లో అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రం ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను అలరించగా, ఇప్పుడు ఆగస్టు 21న జపాన్‌లో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. అక్కడ రికార్డు స్థాయిలో అడ్వాన్సు బుకింగ్స్ జరుగుతున్నాయి. జపాన్‌లో తొలి రోజు అడ్వెన్స్ బుకింగ్స్ పరంగా ‘మిరాయ్’ అత్యంత వేగంగా దూసుకుపోతూ, అక్కడి టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఈ అరుదైన ఘనత సాధించడం ద్వారా టాలీవుడ్ నుంచి జపాన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న అతికొద్ది చిత్రాల సరసన నిలిచింది ‘మిరాయ్’. కేవలం 5 తెలుగు సినిమాలు మాత్రమే ఇంతటి అద్భుతమైన ఓపెనింగ్ అడ్వెన్స్ బుకింగ్స్ రికార్డును సాధించడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందా హై’, రాజమౌళి తీసిన ‘బాహుబలి 2’ చిత్రాల రికార్డులకు అతి సమీపంలో కొనసాగుతోంది. సినిమా విడుదలకు ఇంకా 2 రోజులు సమయం ఉండటంతో, ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో జపాన్ టాప్ 10 జాబితాలో ‘మిరాయ్’ మరింత మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్, పూర్తిస్థాయి విలన్ పాత్ర పోషించాడు

Mirai creates a sensation in Japan. Teja Sajja who attained recognition across the world with the super hero film HanuMan, sometime came up with the film titled Mirai

తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమాకు జపాన్‌లో భారీ స్పందన లభిస్తోంది. డే-1 అడ్వాన్స్ బుకింగ్స్‌లో ధురంధర్ 2, బాహుబలి 2, టైగర్ జిందా హై వంటి సినిమాలను దాటేసింది. హీరో తేజ సజ్జ (Teja Sajja) నటించిన ‘మిరాయ్’ (Mirai) సినిమాకు జపాన్ (Japan)లో భారీ స్పందన లభిస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. జపాన్‌లో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఇప్పటికే ‘ధురంధర్ 2’ (Dhurandhar2), ‘టైగర్ జిందా హై’, బాహుబలి 2 (Baahubali2) వంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం జపాన్‌లో అత్యధిక డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన టాప్-10 భారతీయ చిత్రాల జాబితాలో ‘మిరాయ్’ ఏడో స్థానంలో కొనసాగుతోంది. సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులు సమయం ఉండటంతో ఈ ర్యాంక్ మరింత మెరుగయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తేజ సజ్జ గతంలో ‘హనుమాన్’ (HanuMan) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా విజయంతో ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ‘మిరాయ్’తో అంతర్జాతీయ మార్కెట్లలోనూ తన పరిధిని మరింతగా విస్తరిస్తున్నారు. విభిన్నమైన కథలు, భారీ స్థాయి జానర్ సినిమాలను ఎంచుకుంటూ తేజ సజ్జ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నారు. జపాన్‌లో ‘మిరాయ్’కు వస్తున్న స్పందన చూస్తుంటే ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి

తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ ఫాంటసీ అడ్వెంచర్ ‘మిరాయ్’ థియేట్రికల్ విడుదలకు ముందే జపాన్‌లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. ఆగస్టు 21న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రం, తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. జపాన్‌లో డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అత్యధిక బుకింగ్స్ సాధించిన టాప్ 10 భారతీయ చిత్రాల జాబితాలో ‘మిరాయ్’ ఇప్పటికే చోటు దక్కించుకోవడం విశేషం. సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’, ఎస్.ఎస్. రాజమౌళి ‘బాహుబలి 2’ సరసన నిలిచేందుకు ఈ చిత్రం వేగంగా దూసుకుపోతోంది. జపాన్‌లో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా టాప్ 10లో నిలిచిన అతికొద్ది తెలుగు చిత్రాల్లో ఒకటిగా ‘మిరాయ్’ ఘనత సాధించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ పనులు కూడా ప్రస్తుతం వేగంగా జరుగుతుండగా, జపాన్ బాక్సాఫీస్ వద్ద ఈ అడ్వాన్స్ ట్రెండ్ భారీ వసూళ్లుగా మారే అవకాశం ఉందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది

Teja Sajja s Mirai is already creating buzz in Japan even before its theatrical release. The fantasy adventure, which emerged as a major blockbuster, is now gearing up for its Japanese release on August 21, with early advance-booking numbers adding to the exci

ఒకప్పుడు మీనా .. రంభ .. నగ్మా వంటి బొద్దుగా ఉన్న బ్యూటీలు తెలుగు తెరను ఒక ఊపు ఊపేశారు. స్టార్ హీరోలతో కలిసి వరుస విజయాలను అందుకుంటూ, తమ కెరియర్ ను పరుగులు తీయించారు. అలా కాస్త బొద్దుగా కనిపిస్తూ .. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఈ మధ్య కాలంలో యూత్ ను ఆకట్టుకున్న బ్యూటీగా రితికా నాయక్ కనిపిస్తుంది. 'మిరాయ్' సినిమాలో ఈ సుందరిని చూసిన కుర్రాళ్లు, థియేటర్స్ దగ్గరే మనసులు పోగొట్టుకున్నారు. ఈ ముద్దుగుమ్మ నెలకో సినిమా చేస్తే బాగుండునే అనుకున్నారు. కానీ 'మిరాయ్' మాదిరిగానే తనకి బాగా నచ్చే కంటెంట్ కోసం రితికా ఎదురుచూస్తూ వచ్చిందనే విషయం, 'కొరియన్ కనకరాజు' రిలీజ్ తరువాతనే అర్థమవుతోంది. రీసెంటుగా విడుదలైన ఈ సినిమా, అనూహ్యమైన రెస్పాన్స్ ను అందుకుంది. కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా ఫలితం ఊరటను ఇచ్చింది .. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమాలోను నటన పరంగా .. గ్లామర్ పరంగా రితికా మంచి మార్కులు కొట్టేసింది. అందానికి అదృష్టం తోడైతే ఇలాగే ఉంటుందని అనిపించింది. కొంత కాలంగా టాలీవుడ్ లో హీరోయిన్స్ వైపు నుంచి సందడి తగ్గిందనే చెప్పాలి. ఒకటి రెండు సినిమాలు చేసుకుపోతున్నారే తప్ప, నిలకడగా ఎవరూ సక్సెస్ లు సాధించలేకపోతున్నారు. టాప్ త్రీ .. టాప్ 5 అంటూ గతంలో మాదిరిగా ఒక జాబితా చూసుకుంటే, ఎవరూ కనిపించని ఒక గందరగోళం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరో భారీ హిట్

Ritika Nayak has steadily built a strong presence in Telugu cinema with carefully chosen roles that showcase both her charm and growing range. After making her debut in 2022 with *Ashoka Vanamlo Arjuna Kalyanam*, she followed it up with a memorable cameo in th

Ritika Nayak is slowly gaining a new image in Telugu cinema that of a lucky charm. Although she appeared in films such as Ashoka Vanamlo Arjuna Kalyanam and Hi Nanna, it was Mirai that gave her wider recognition and established her as a promising heroine in Te

పరిశ్రమ ఎప్పుడూ సక్సెస్ వెంటే పడుతుంది. ఒక్క హిట్ కొడితే చాలు వరుసగా అవకాశాలొస్తాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్లు హిట్ కొట్టారంటే ఇండస్ట్రీ అంతా ఆమె వెంట పడుతుంది. ఇప్పుడు టాలీవుడ్ కు అలాంటి మరో హీరోయిన్ దొరికేసింది. పేరు రితికా నాయక్ (Ritika Nayak). ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) సినిమాతో రితికా నాయక్ హిట్ కొట్టింది. దీంతో ఆమెను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు మేకర్స్ తెగ ప్రయత్నిస్తున్నారు. కేవలం ఒక్క సక్సెస్ తో ఆమెకు ఈ క్రేజ్ రాలేదు. ‘కొరియన్ కనకరాజు’ కంటే ముందు ఆమె ‘మిరాయి’ అనే సినిమాలో నటించింది. అది కూడా పెద్ద హిట్టయింది. అంతకంటే ముందు ‘హాయ్ నాన్న’లో క్యామియో చేసింది. ఇలా చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ వరుసగా సక్సెస్ లున్నాయి. అందుకే రితికాను ఆఫర్లు వెదుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం తన వద్దకు వచ్చిన ఆఫర్ల నుంచి మంచి కథల్ని ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది రితికా. త్వరలోనే ఆమె నుంచి కొత్త సినిమాల ప్రకటనలు రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ భామ ‘మిరాయి 2’ (Mirai 2) ఒప్పుకొంది