© 2026 nimisham.in


ఆల్‌టైం రికార్డ్ ధరకు జైలర్ 2 రైట్స్? రజనీ మూవీకి ఆంధ్రా- నైజాం హక్కులు ఎన్ని కోట్లంటే?

2026 దసరా క్లాష్: అన్ని డౌట్స్ క్లియర్.. తలైవర్ తో పోటీకి సై అంటున్న యువ హీరోలు

జైలర్ 2 రీ షూట్స్ వెనక అసలు కారణం అదేనా..?

రిమాండ్ ఖైదీకి వసతులు కల్పించేందుకు లంచం

జైల్లో ఖైదీకి విలాసాల కోసం లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన హుజురాబాద్ సబ్‌జైల్ డిప్యూటీ జైలర్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్-2పై (Jailar 2) ఆసక్తికరమైన గాసిప్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

జైలర్ 2 బిజినెస్ డీటెయిల్స్.. తెలుగు హక్కులపై వీడని ఉత్కంఠ!

రణబాలి పోటీతో జైలర్ 2 విడుదల వాయిదా నిజమేనా?
సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'జైలర్ 2' ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023లో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'జైలర్' మూవీకి సీక్వెల్ ఇది. దసరా కానుకా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మూవీ వాయిదా పడనుందని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.'జైలర్ 2' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పెండింగ్ ఉండటంతో సినిమా అనుకున్న తేదీకి విడుదల కావడం కష్టమే అనే కామెంట్స్ వచ్చాయి. పోస్ట్ పోన్ అవుతుందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటికి చెక్ పెడుతూ మేకర్స్ బిగ్ అప్డేట్ అందించారు. ముందుగా ప్రకటించినట్లే 2026 అక్టోబర్ 15న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇందులో రజనీ చేతిలో తుపాకీ పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తూ నిలబడి ఉన్నారు.'జైలర్ 2' నుంచి ఇటీవల వచ్చిన 'అలా బోలేలో' సాంగ్ వైరల్ అవుతోంది. అంతకముందు రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ టీజర్, రిలీజ్ డేట్ గ్లింప్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మిథున్ చక్రవర్తి, ఎస్జే సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు, మిర్నా, అన్నా రాజన్, యోగిబాబు, జతిన్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, జాకీ ష్రాఫ్ స్పెషల్ క్యామియో రోల్స్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు

సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ జైలర్ 2 రిలీజ్ పై గత కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ చాలా సైలెంట్ గా సాగుతుండటం, రీషూట్స్ జరుగుతున్నాయనే పుకార్లు రావడంతో పాటు దసరా రేసులో తెలుగు సినిమాలు కూడా పోటీ పడుతుండటంతో జైలర్ 2 వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సినిమా పోస్ట్‌పోన్ అవుతుందంటూ జరుగుతున్న అసత్య ప్రచారాలకు సన్ పిక్చర్స్ తమదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టింది. చిత్ర యూనిట్ అఫిషియల్ గా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, సినిమాను 2026 అక్టోబర్ 15నే గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ విడుదల చేసిన లేటెస్ట్ పిక్చర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ లుక్ లో రజనీకాంత్ చేతిలో తుపాకీ పట్టుకుని చాలా మాస్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ పై మొదటి భాగంలోని సూపర్ హిట్ డైలాగ్ 'అలప్పారై సెలబ్రేషన్స్' లైన్ తో పాటు అక్టోబర్ 15 రిలీజ్ డేట్ ను స్పష్టంగా మెన్షన్ చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి భాగాన్ని మించేలా పార్ట్ 2 ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ, యోగి బాబు, మిర్నా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, ఎస్. జె. సూర్య కీలక పాత్రల్లో

పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘జైలర్ 2’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గత కొద్ది రోజులుగా చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రమోషనల్ అప్డేట్స్ రాకపోవడంతో, సినిమా విడుదల వాయిదా పడనుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి చెక్ పెడుతూ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లే అక్టోబర్ 15, 2026న ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని స్పష్టం చేస్తూ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ‘అలా బొలేలో’ సాంగ్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, త్వరలోనే ప్రమోషన్ల స్పీడ్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, ఎస్.జె. సూర్య, హృతిక్ రోషన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు

రజనీకాంత్ 'జైలర్ 2' సినిమాని లెక్క ప్రకారం వచ్చే నెల 15న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. కానీ సోషల్ మీడియాలో లెక్కలేనన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని డైలాగ్స్ తొలగించి రీషూట్ చేస్తున్నారని, దీంతో చెప్పిన తేదీకి విడుదల కాకపోవచ్చే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయం నిర్మాణ సంస్థ దృష్టికి వెళ్లడంతో అలర్ట్ అయింది. ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) ముందే చెప్పినట్లు అక్టోబరు 15నే 'జైలర్ 2' థియేటర్లలో రిలీజ్ కానుందని కొత్తగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదివరకే పూర్ణ చేసిన స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. విడుదలకు మరో నెలన్నర ఉంది కాబట్టి కొన్నిరోజుల తర్వాత ప్రమోషన్లు మొదలుపెడతారేమో అనిపిస్తుంది. 'జైలర్ 2'కి పోటీగా తెలుగులో విజయ్ దేవరకొండ 'రణబాలి', వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' బరిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బాక్సాఫీస్ దగ్గర దసరాకి మంచి ఫైట్ చూడొచ్చు. 2023లో వచ్చిన 'జైలర్' అద్భుతమైన సక్సెస్ అందుకుని రజనీకాంత్‌కి కంబ్యాక్ మూవీగా నిలిచింది. సూపర్‌స్టార్ పని ఇక అయిపోయింది అనే టైంలో రిలీజైన ఈ మూవీ తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు సీక్వెల్‌పైనా బజ్ ఓ మాదిరిగా ఉంది. తొలి భాగంలోని నటీనటులు ఇందులోనూ కనిపించబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. (ఇదీ చదవండి: అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు) పులివెందుల : భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ (ఫొటోలు) తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక Idupulapaya: YSR ఘాట్ వద్ద జగన్ నివాళులు Nepal Floods: ప్రియ

Super Star Rajinikanth's upcoming project Jailer 2 is attracting the attention of all as it is the sequel to the hit film Jailer. The film directed by Nelson Dilip Kumar already wrapped the shoot five days back and is on track for the 15 October release

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న జైలర్ 2 (Jailer 2) పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక జైలర్ 2 అంతకుమించి ఉండనుందని తెలియడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ కానుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 15 న రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. జైలర్ 2 అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదని తమిళ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జైలర్ 2 వాయిదా పడడానికి ప్రధాన కారణం తమిళనాడు సీఎం విజయ్ అని కోలీవుడ్ కోడై కూస్తోంది. అదేంటీ.. ఆయనకు, జైలర్ 2 కి సంబంధం ఏంటి అంటే.. ఈ సినిమాలో మొదట విజయ్ రాజకీయాల్లో గెలవరు అనుకోని రజనీ ప్రభుత్వం, రాజకీయ పనితీరుపై కొన్ని ఘాటు డైలాగ్స్ చెప్పాడట. కానీ, విజయ్ గెలిచి సీఎం కూడా అయ్యారు. ఇప్పుడు ఆ డైలాగ్స్ ని విజయ్ ఫ్యాన్స్ అపార్థం చేసుకుంటే సినిమాకి డ్యామేజ్ జరుగుతుందనే ఉద్దేశంతో డైరెక్టర్ నెల్సన్ కీలక మార్పులు చేయడం మొదలుపెట్టాడట. దీనికోసమే కొత్తగా డైలాగ్స్ రాసి.. రీషూట్ చేస్తున్నారట. ఈ షూట్ కాకుండా ఇంకా ఈ సినిమాకు బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ కాలేదని టాక్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేకర్స్.. అక్టోబర్ 15 న కాకుండా కొత్త తేదీని వెతికే పనిలో పడ్డారట. ఇక ఈ రేసులో జైలర్ 2 వెనక్కి తగ్గితే ఆ స్లాట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారి

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘జైలర్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా అనుకున్న సమయానికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెన్నై వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ నుండి అధికారిక సమాచారం లేకపోయినా, ఈ స్లాట్‌ను ఖాళీగా చూసి మైత్రి సంస్థ ‘రణబాలి’ చిత్రాన్ని అక్టోబర్ 16కి ఫిక్స్ చేసిందని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’ కూడా ఈ రేస్‌లోకి రావాలని చూస్తోంది. ఈ వాయిదాకి ప్రధాన కారణం రీ-షూట్స్ అని తెలుస్తోంది. ప్రభుత్వ పనితీరుపై ఉండే కొన్ని సీన్లు విజయ్ ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టకుండా దర్శకుడు నెల్సన్ కీలక మార్పులు చేస్తున్నారట. దీంతో, రిలీజ్‌కు కేవలం 45 రోజులే ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్లపై పరుగులు తీయాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఇంకా పూర్తి కాకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. ఇటీవల తమిళ డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో వచ్చిన ఆదరణను బట్టి, తెలుగు హక్కుల కోసం నిర్మాతలు ఊహించని రేటు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటీవలే విడుదలైన పూర్ణ స్పెషల్ సాంగ్‌కు మిక్సిడ్ రెస్పాన్స్ రావడం కాస్త చర్చనీయాంశంగా మారింది. చివరి దశ షూటింగ్ త్వరగా పూర్తి చేసి సన్ పిక్చర్స్ క్లారిటీ ఇస్తే తప్ప ఈ వాయిదా ప్రచారానికి తెరపడదు